FbTelugu

లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ రిజిస్ట్రార్

Subregistrar-caught-taking-bribes

కర్నూలు: డోన్ సబ్ రిజిస్ట్రార్ నాగన్న రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పక్కాగా దొరికిపోయారు. డాక్యుమెంట్ రైటర్ అబ్దుల్లా రహీంతో కలసి సబ్ రిజిస్ట్రార్ నాగన్న లంచం తీసుకున్నారు. ఒక పని కోసం రూ.17 వేలు లంచం డిమాండ్ చేసి రూ.10 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఇవ్వాళ డోన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. వెల్దుర్తి మండలనికి చెందిన బాదితులు తండ్రి రామతిమ్మా రెడ్డి, కొడుకు రవీంద్రనాథ్ రెడ్డి లు రు.10 ,000 లంచం పట్టుకున్నామన్నారు. నాగన్న భార్య, కొడుకు పేరుతో కర్నూలులో 10 సెంట్ల స్థలం, తిరుపతిలో అపార్ట్ మెంట్ లో ఒక ప్లాట్, భార్య పేరున 11 సెంట్ల స్థలం గుర్తించారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ రైటర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని, పరిధిని దాటి రైటర్లు వ్యవహరిస్తున్నారని ఏసీబీ డీఎస్సీ నాగభూషణం తెలిపారు. పట్టుకున్న తరువాత సబ్ రిజిస్ట్రార్ నాగన్న ఇంట్లో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు చేశామన్నారు.

You might also like