FbTelugu

విశాఖ రాజధానిగా వద్దనే మొదటి వ్యక్తిని: సబ్బంహరి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా విశాఖను వద్దనే మొదటి వ్యక్తిని తానేనని మాజీ ఎంపీ సబ్బంహరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ ఆలోచనా విధానం మొదటి నెలలోనే అర్థమైందని అన్నారు.

వైసీపీ విధానాలతో తెలుగు ప్రజల ఆశలు ఆవిరయ్యాయని అన్నారు. అమరావతి ఉద్యమంలో మహిళలు మాట్లాడే మాటలు అమోఘమని అన్నారు. వారి డిమాండ్లు న్యాయబద్ధంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం చర్యలను ప్రజలంతా చీదరించుకుంటున్నారని అన్నారు. విశాఖపట్నం నుండి అమరావతి వరకు పాదయాత్రగా రావాలని తాను బావించినట్టు తెలిపారు. కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడిందన్నారు.

కౌన్సిల్ రద్దు చేస్తామని చెప్పి మరల వెనుకడుగు వేసి ఇద్దరు ఎమ్మెల్సీలను ఎన్నక చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. 60 సంవత్సరాల పాటూ హైదరాబాద్ లో ఇటుక ఇటుక కట్టి అభివృద్ధి చేస్తే కట్టుబట్టలతో బయటకు పంపారు అని అన్నారు. నూతన రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి ప్రజల ఆశలకు రూపకల్పన చేసిందని, కానీ ప్రభుత్వం మారడం వలన ప్రజలు రోడ్లుపైకి వచ్చారని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలు కన్నకళలు సాకారం అయ్యేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి పోరాటం చేయాలని సూచించారు.

You might also like