FbTelugu

ప్రగతి భవన్ ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్: డిగ్రీ పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్ చేయాలని, ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూలును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్ యూఐ విద్యార్థులు ప్రగతి భవన్ ను ముట్టడించారు.

పీపీఈ కిట్లు ధరించి డీసీఎం వ్యాన్ లో వచ్చిన ఎన్ఎస్ యూఐ విద్యార్థులు ప్రగతి భవన్ గేట్ ఎక్కి లోనికి దూకారు. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ లోపు భద్రతా సిబ్బంది చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. డిగ్రీ, ఓయూ, యూజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా నేరుగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు ని ఆశ్రయించామని విద్యార్థులు తెలిపారు.

అయినా ప్రభుత్వం లెక్క చేయకుండా ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్ ప్రకటించిందని ఆరోపించారు. కరోనా కు వ్యాక్సిన్ వచ్చే వరకు పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ అంశాలు హైకోర్టు విచారణలో ఉండగానే ప్రభుత్వం ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించాలని చూస్తుందని విమర్శించారు. కరోనా సమయంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు ప్రమాదమన్నారు. ప్రగతి భవన్ ముట్టడించిన విద్యార్థులను అరెస్ట్ చేసి గోశామహల్ పీఎస్ కు తరలించారు.

You might also like