FbTelugu

మొక్కుబడిగా హాజరైన విద్యార్థులు

హైదరాబాద్: కరోనా స్ట్రెయిన్ వైరస్ విజృంభిస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు పునః ప్రారంభించింది. స్ట్రెయిన్ వైరస్ భయంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు బడికి పంపేందుకు వెనకంజ వేస్తున్నారు.

రాష్ట్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో రెండో రోజు కూడా విద్యార్థుల హాజరు స్వల్పంగానే ఉంది. ఆరవ తరగతి నుంచి ఎనిమిది వరకు తొలిరోజు 9 శాతం హాజరు నమోదు కాగా.. మరుసటి రోజు స్వల్పంగా పెరిగి 14 శాతం విద్యార్థులు మాత్రమే వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో 17శాతం, ప్రైవేటు పాఠశాలల్లో 14శాతం హాజరు నమోదైనట్లు పాఠశాల విద్యా శాఖ అంచనాకు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో 5,47,479 మంది విద్యార్థులకు గాను 94,244 మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల్లో 7,57,319 మందికిగాను 1,02,831 మంది విద్యార్థులు హాజరయ్యారు. నిజామాబాద్, నారాయణపేట జిల్లాల్లో అత్యధికగా 28 శాతం హాజరయ్యారు. అతి తక్కువగా మేడ్చల్, ములుగు జిల్లాల్లో 5శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. ఒక వారం రోజులు అయితే కాని ఎంత మంది వస్తున్నారనేది నిర్థిష్టంగా అంచనా వేయలేమని విద్యాశాఖ పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.