FbTelugu

అలిపిరి లో గుండెపోటుతో విద్యార్థి మృతి

తిరుమల: అలిపిరి నడక‌మార్గంలోని గాలిగోపురం వద్ద భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. కుమారుడు హఠాన్మరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఇవాళ శ్రీవారి దర్శనార్ధం నడక మార్గం గుండా వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన భక్తుడు హైదరాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్ధి రాహుల్‌గా విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం తిరుపతి రుయా కి తరలించారు. శ్రీవారి దర్శనానికి వెళ్లిన రాహుల్ విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు శోకంలో మునిగిపోయారు. శవ పరీక్ష తరువాత రాహుల్ మృతదేహాన్ని హైదరాబాద్ తరలించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.