అమరావతి: అధికారులకు ఎంతగా చెప్పినా పట్టించుకోకపోవడంతో విద్యార్థులే రంగంలోకి దిగి అక్రమ మట్టి వ్యాపారానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తమ పాఠశాల ముందు నుంచి వెళ్తున్న మట్టి లారీలను నిలిపివేశారు.
చేబ్రోలు మండలం శేకూరు లో స్కూల్ విద్యార్థులు ఇవాళ ఉదయం ఆందోళనకు దిగారు. తమ పాఠశాల ముందు నుంచి వెళ్తున్న మట్టి లారీల నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వందలాది లారీలు నిలిచిపోయాయి.లారీలు విచ్చలవిడిగా తిరగడంతో పలు సార్లు ప్రమాదాలు జరిగాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు రంగ ప్రవేశం చేసి లారీలను అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే విద్యార్థుల నిరసనకు గ్రామస్తులు మద్దతు తెలిపారు.
మట్టి లారీలతో తమ పంట పోలాలు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన ఫలితం లేదని మండిపడ్డారు. మైనింగ్ మాఫీయాపై చర్యలు తీసుకోవాలి విద్యార్థులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.