FbTelugu

సెల్ఫీ వీడియో తీసి విద్యార్థిని ఆత్మహత్య

నెల్లూరు: సెల్ఫీ వీడియో తీసి అనంతరం ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలోని బీవీ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని తనను ముగ్గురు యువకులు వేదిస్తున్నారంటూ.. సెల్ఫీవిడియోతీసి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఇది గమనించని కుటుంబ సభ్యులు ఆలస్యంగా గమనించే సరికే అప్పటికే మృతి చెందింది. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like