FbTelugu

చదువుల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య

విజయవాడ: చదువుల ఒత్తిడి తట్టుకోలేక బట్టి శిరీష కాలేజీ హాస్టల్ లో తన రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. మృతి చెందిన విద్యార్థి శిరీష స్వగ్రామం చిత్తూరు జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలం రంగసముద్రం.
శిరీష పెనమలూరు మండలం పోరంకి గ్రామంలోని శ్రీచైతన్య కాలేజీ సరస్వతి సౌధమ్ లో ఇంటర్ బిపిసి ద్వితీయ సంవత్సరం చదువుతూ హాస్టల్ లో ఉంటున్నది.

ఈనెల 7వ తేదీ ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయిన తరువాత శిరీష ను ఆమె తల్లిదండ్రులు బట్టి మంజుల, మదన్ మోహన్ రెడ్డి తమ స్వగ్రామానికి తీసుకు వెళ్లారు. ఇవాళే (12వ తేదీన) పోరంకి గ్రామం లోని హాస్టల్ కు తీసుకువచ్చి అప్పగించి వెళ్లారు. అప్పగించి వెళ్లిపోయిన తరువాత ఉదయం పూట ప్రెష్ అప్ అవ్వటానికి హాస్టల్ రూము నెం.247, అరుంధతి బ్లాక్ కు వెళ్ళి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకున్నది. తన చూన్నీతో స్టడీ చైర్ ను ఉపయోగించి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలిసుకున్న వెంటనే హాస్టల్ ఇన్ ఛార్జి ఆమెను హుటాహుటిన 100 అడుగుల రోడ్డులోని కామినేని హాస్పిటల్ కు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి చనిపోయిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.