FbTelugu

ప్రిన్సిపాల్ మందలించాడని విద్యార్థి ఆత్మహత్య

గుంటూరు: ప్రిన్సిపాల్ మందలించాడని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకెళితే.. సాంబశివరావు అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. యూనిఫాం వేసుకోకుండా స్కూలుకు వెళ్లాడు.

యూనిఫాం లేకుండా వచ్చినందుకు స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థిని మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి ఇంటికి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.