FbTelugu

వెంటిలేటర్లపై కేంద్రం మొండి చెయ్యి: ఈటల

హైదరాబాద్: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి కావాల్సిన సాయం అందించేందుకు కేంద్రం ముందుకు రావడం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు.

ఒక వెయ్యి వెంటిలేటర్ లు కావాలని కేంద్రాన్ని, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ను కోరితే, ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇలా అయితే కరోనా వైరస్ తో ఎలా పోరడతామో చెప్పాలన్నారు. మెక్రాన్ ఫౌండేషన్ ప్రతినిధులు మంత్రి రాజేందర్ ను కలిసి ఒక వంద వెంటిలేటర్స్ ను అందచేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ మైక్రాన్ ఫౌండేషన్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఊపిరి తిత్తుల మీద ప్రభావం ఎక్కువగా పడుతుందని అన్నారు. అన్నిటికంటే ముందు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పేషెంట్ లకు అత్యవసర సమయంలో వెంటిలేటర్స్ సహాయం అవసరం అన్నారు. అందుకోసమే ఎక్కువ వెంటిలేటర్స్ సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని మన్నించి వెంటిలేటర్స్ తయారు చేసి ఇవ్వడానికి ముందుకు వచ్చిన డీఆర్ డీఓ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు బీఆర్ కేఆర్ భవన్ లో అమెరికన్ ఇండియా ఫౌండేషన్, గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైక్రాన్ సంస్థ వంద వెంటిలేటర్స్ ను మంత్రి ఈటల రాజేందర్ గారికి అందించారు. 80 వెంటిలేటర్స్ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి కి, 10 ఉస్మానియా ఆసుపత్రికి, 10 ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ కి అందించారు. మరో వంద వెంటిలేటర్స్ కూడా అందిస్తామని వారు తెలిపారు. వీటితో పాటు 5000 పీపీఈ కిట్స్, 5000 ఎన్95 మాస్క్ లు కూడా అందించారు. ఈ కార్యక్రమంలో మైక్రాన్ డైరెక్టర్ రాధిక, మేనేజర్ మురళి, అమెరికన్ ఇండియా ఫౌండేషన్ స్టేట్ ప్రోగ్రామ్ మెనేజేర్ వినయ్ సనం, గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినబాబు, కిరణ్, గాంధీ ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ రాజారావు పాల్గొన్నారు.

You might also like