FbTelugu

సింగరేణిలో సమ్మె షురూ

భూపాలపల్లి: దేశంలో బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ సింగరేణి కార్మికులు సమ్మెకు దిగారు.

కేంద్ర ప్రభుత్వం బొగ్గుల ప్రైవేటీకరణకు నిరసనగా 72 గంటల సమ్మె చేస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. కొత్తగూడెం, భూపాలపల్లి, మణుగూరు, గోదావరి ఖని ప్రాంతాల్లో కార్మికులు విధులకు గైర్హాజరు అయ్యారు. రాష్ట్రంలోని కోల్ ఇండియాకు చెందిన గనుల్లో కూడా సమ్మె మొదలైంది. కార్మికులందరూ సమ్మెలో పాల్గొనడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు రోజుల సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు కార్యాలయాల వద్దకు చేరుకుని పిలుపునిచ్చారు.
సమ్మెను విచ్చిన్నం చేసేందుకు టీబీజీకేఎస్ ప్రయత్నిస్తోందని, అందుకే ఒకరోజు కు పిలుపునిచ్చిందని ఇతర కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంస నాయకులు పాల్గొన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా కార్యాలయాలు, గనుల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

You might also like