FbTelugu

‘సప్తగిరి’ బాధ్యులపై కఠిన చర్యలుంటాయి: వెల్లంపల్లి

తిరుపతి: సప్తగిరి పత్రికలో అన్యమత ప్రచారం విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన తిరుమలలో పర్యటించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ..

దర్శన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కరోనా నియంత్రణకు టీటీడీ చర్యలు అభినందనీయమన్నారు. టీటీడీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను భక్తులు నమ్మవద్దని సూచించారు. అనంతరం దర్శన, లడ్డూ కౌంటర్లు, అన్నప్రదాస కేంద్రాలను పరిశీలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.