FbTelugu

వ్యాక్సిన్ పై వీధి వీధిలో ప్రచారం

అమరావతి: కరోనా వైరస్ విజృంభిస్తున్నా ప్రజలు వ్యాక్సిన్ తీసుకునే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 45 ఏళ్లు దాటిన వారు కూడా తీసుకోవాలని మొత్తుకుంటున్నా పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ‘టీకాల ఉత్సవం’ బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగు రోజులు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో రోజుకు 2 లక్షల టీకాలు వేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. కానీ, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 75 వేల మంది మాత్రమే వేయించుకోవడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. వ్యాక్సిన్లు వేయించుకునేందుకు మరింత మందిని రప్పించేందుకు, ప్రాధాన్యత తెలిపేలా వీధి వీధిలో ప్రచారం చేయాలని ఆరోగ్య కార్యకర్తలను ప్రభుత్వం ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.