FbTelugu

జిల్లా కలెక్టర్ కు విచిత్రమైన శిక్ష!

హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసు లో నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు కనువిప్పు కలిగే తీర్పు ఇచ్చారు. అనాథాశ్రమంలో వారానికి 2 గంటలు గడపాలని కలెక్టర్‌కు ఆదేశించింది. ఇలా ఆరు నెలలపాటు అనాథాశ్రమానికి వెళ్లి సేవ చేయాలని స్పష్టం చేసింది.

జిల్లా కలెక్టర్ తో పాటు విశ్రాంత పౌరసరఫరాల జిల్లా అధికారి సంధ్యారాణికి ఉగాది, శ్రీరామనవమి రోజుల్లో అనాథాశ్రమంలో భోజనాలు పెట్టాలని ఆదేశించింది. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ జడ్జి ఇద్దరికి రూ.2వేల జరిమానా విధించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టేయాలని ధర్మాసనం ఎదుట అప్పీల్ చేశారు. అప్పీల్ ను విచారించిన ధర్మాసనం సామాజిక సేవ చేయాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.