FbTelugu

ఏలూరులో వింత రోగం.. 140 మందికి అస్వస్థత

పశ్చిమ గోదావరి: జిల్లాలోని ఏలూరులో ఓ వింత రోగం స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. అంతుచిక్కని రోగంతో ఇప్పటికే 140 మంది అస్వస్థతకు గురైనారు. చిన్నారులు ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోతున్నారు. దీనిపై స్పందించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు.

బాధితులకు మూర్చ, స్ఫృహతప్పిపోవడం వంటి లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. ఇప్పటి వరకు ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 140 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నట్టుగా గుర్తించారు. అస్వస్థతకు గురైన చిన్నారులను మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. ఇప్పటి వరకు ఎవరికీ ప్రాణాపాయం లేదని డీసీహెచ్ఎస్ ఏవీఆర్ మోహన్ స్పష్టం చేశారు. మూడు రోజులుగా తాగునీరు రంగుమారి వస్తుందని స్థానికులు తెలుపుతున్నారు. కలుషిత నీరే కారణమై ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.