FbTelugu

359 మందికి వింత రోగం.. ఏలూరులో తీవ్ర కలకలం

* తీవ్రంగా విజృంభిస్తున్న వ్యాధి
* నేడు బాధిత ప్రాంతాలకు సీఎం జగన్

పశ్చిమగోదావరి: జిల్లాలో వింత రోగం తీవ్రంగా విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. నిన్నటికి 150 వరకు ఉన్న బాధితుల సంఖ్య ఒక్కరోజులోనే 359 కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారు తీవ్ర అస్వస్థత, మూర్చకు గురికావడం జరుగుతోంది. బాధితుల్లో అత్యధికంగా పిల్లలు, మహిళలలే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యాధి భారిన పడిన వారిలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 117 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం ప్రస్తుతం 241 మంది చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.