FbTelugu

తెలంగాణ, ఏపీలో ‘‘స్ట్రెయిన్ వైరస్’’ వచ్చేసింది

హైదరాబాద్: తెలంగాణ, ఏపీలో కరోనా స్ట్రెయిన్ వైరస్ వచ్చేసింది. యూకే నుంచి వరంగల్ కు వచ్చిన ప్రయాణికుడికి స్ట్రెయిన్ వైరస్ సోకింది. అదే విధంగా ఏపీలోని రాజమండ్రికి చెందిన మహిళకు వచ్చింది.
దీనికి బి 1.1.7 గా నామకరణం చేసినట్లు సీసీఎంబీ ప్రకటించింది. ఈ వైరస్ పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని సీసీఎంబీ స్పష్టం చేసింది. కొత్త వైరస్ 17 రకాల మ్యుటేషన్లను కలిగి ఉందని తెలిపింది. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం స్ట్రెయిన్ రాలేదని అంటుండగా, సీసీఎంబీ మాత్రం నిర్థారణ అయిందని ప్రకటించడం గందరగోళానికి దారితీస్తున్నది.

ఏపీలో యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు స్ట్రెయిన్ వచ్చిందని, ఆమె ద్వారా కుమారుడికి రాలేదని ఏపీ వైద్య ఆరోగ్య కమిషనర్ భాస్కర్ తెలిపారు. ఆమెతో సన్నిహితంగా ఉన్నవారికి కూడా నెగెటివ్ రిపోర్టు వచ్చిందని ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.