FbTelugu

ఒకే కుటుంబంలో నలుగురికి స్ట్రెయిన్

* కర్ణాటకలో స్ట్రెయిన్ కలకలం
బెంగళూరు: కర్ణాటకలో కరోనా కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే బెంగళూరులో ఏడు కొత్త వైరస్ స్ట్రెయిన్ కు సంబంధించిన కేసులు నమోదైనాయి. స్థానిక శివమొగ్గలో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా స్ట్రెయిన్ సోకినట్టుగా అధికారులు గుర్తించారు.

దీంతో అప్రమత్తమైన అధికారులు స్ట్రెయిన్ సెకండరీ కాంటాక్ట్ లను గుర్తించే పనిలో పడ్డారు. స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో బెంగళూరులో న్యూఇయర్ వేడుకలను అధికారులు రద్దు చేశారు. కర్ణాటకలో రాత్రివేళల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.