FbTelugu

కర్ణాటకలో స్ట్రెయిన్ విజృంభణ

బెంగళూరు: కర్ణాటకలో కొత్త స్ట్రెయిన్ విజృంభణ మొదలైంది. యూకే నుంచి బెంగళూరు వచ్చిన 18 మందికి స్ట్రెయిన్ సోకడంతో కలవరపడుతున్నారు. స్ట్రెయిన్ కేసుల ను నియంత్రించేందుకు రాత్రిపూట లాక్ డౌన్ విధించాలని నిర్ణయించిన ప్రభుత్వం మళ్లీ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.

కర్ణాటకకు ఈ మధ్యకాలంలో యూకే నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వారి టిక్కెట్ అడ్రస్ ఆధారంగా వివరాలలు సేకరించారు. వారి ఇళ్ల వద్దకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యకర్తలు వెళ్లి నమూనాలు సేకరించి పరీక్షించారు. కరోనా పాజిటివ్ సోకిన వారి నమూనాలు పరీక్షించగా వారిలో 18 మందికి స్ట్రెయిన్ వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమై జాగ్రత్తగా ఉండాలని సర్క్యూలర్ జారీ చేసింది. యూకే నుంచి వచ్చిన ప్రయాణీకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరో 185 మంది రిపోర్టుల కోసం వేచి చూస్తున్నారు. వారి రిపోర్టులు అందితే కాని తదుపరి ఏం చర్యలు తీసుకుంటారనేది తెలియదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.