FbTelugu

తుఫాన్ ప్రభావం.. నేడు భారీ వర్షాలు

Storm-effect--Heavy-rains-today

బుల్ బుల్ తుఫాన్ బంగాళాఖాతంలో తీవ్రమైన నేపథ్యంలో నేడు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు విశాఖపట్టణం వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ తుపాను తీవ్రతరంగా ఉన్న నేపథ్యంలో జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నేటి అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్‌ సాగర్‌ దీవులు, బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ తుఫాను ప్రభావంతో ఏపీతో పాటూ పలు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

You might also like