FbTelugu

18 రోజులు ఆపి, మళ్లీ దంచుతున్నారు!

న్యూఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయనే ఉద్దేశంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 18 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. ఇలా ముగిశాయో లేదో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేశాయి.

దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 16 పైసల మేరకు ధరలను పెంచారు. తాజా పెంపుతో పెట్రోలు ధర రూ. 90.56కు, డీజిల్ ధర రూ.80.73కు పెరిగింది. గత సంవత్సరంలో పెట్రోలు ధర సగటున రూ. 21.58, డీజిల్ ధర రూ. 19.18 పెరిగిన సంగతి తెలిసిందే. ఇండియాలో పన్నులు లేకుంటే, పెట్రోలు ధర లీటరుకు రూ. 33 మించదు. ఉదాహరణకు ఢిల్లీనే చూసుకుంటే, అక్కడ లీటరు పెట్రోలు ధర రూ. 32.98 కాగా, రాష్ట్ర ప్రభుత్వ సేల్స్ ట్యాక్స్, వ్యాట్ కలిపి రూ. 19.55 కాగా, సెంట్రల్ ఎక్సైజ్ సుంకం రూ. 31.83, వ్యాట్ రూ. 10.99 ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.