FbTelugu

సచివాలయ భవనాలు కూల్చివేతకు బ్రేక్

హైదరాబాద్: సచివాలయంలో భవనాల కూల్చివేత పనులకు హైకోర్టు బ్రేక్ వేసింది. సోమవారం వరకు కూల్చివేత నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.

సచివాలయంలోని భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని ప్రొఫెసర్ పి ఎల్ విశ్వేశర్ రావ్ హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ప్రస్తుతం కరోనా నిబంధనలు ఉల్లంగిస్తూ భవనాల ను కూల్చివేస్తున్నారని  పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. భవనాల కూల్చివేయడం వలన వాతావరణ కాలుష్యం అవుతుందని తెలిపారు.

మున్సిపల్ సాలీడ్ వేస్ట్ మేనేజిమెంట్ నిబంధనలను పట్టించుకోకుండా కూల్చివేత చేపడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటీషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సచివాలయం భవనాలు కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చింది. సోమవారం వరకు కూల్చివేత నిలిపివేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉన్నది. వారం రోజుల క్రితమే కూల్చివేతకు హైకోర్టు అనుమతించిందని, అందుకే కూల్చివేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆదేశాలు అందే వరకు కూల్చివేతలు కొనసాగించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.

You might also like