FbTelugu

ఆర్.టి.పి.సి.ఆర్ టెస్టులు స్టాప్

అమరావతి: రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలకు సంబంధించి ఆర్.టి.పి.సి.ఆర్ ద్వారా చేసే టెస్టులను ఏపి ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.

ఇకనుంచి రెండు రోజుల పాటు కేవలం ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల ద్వారా మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సిందిగా ప్రభుత్వం డిఎంహెచ్ఓ లను ఆదేశించింది. వారం రోజులుగా పెండింగ్ లో ఉన్న నమూనాలు, రిపోర్టులను పూర్తిగా పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్.టి.పి.సి.ఆర్ నిలిపివేతతో 1.4 లక్షల ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను ప్రభుత్వం జిల్లాలకు సరఫరా చేసింది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న కరోనా పరీక్షల ఫలితాలను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.