FbTelugu

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: భారత స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇవాళ కూడా మార్కెట్లు ముగిసే సమయానికి భారీ నష్టాలనే చవిచూశాయి. ఇవాళ సెన్సెక్స్ 335 పాయింట్లను నష్టపోయి 37736 వద్ద ముగిసింది.

ఇదే సమయంలో నిఫ్టీ కూడా 100 పాయింట్లు నష్టపోయి 11,102 వద్ద స్థిరపడింది. మారుతి సుజుకి, సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వల్ప లాభాలను చవిచూసాయి. దాదాపు మిగతా అన్ని షేర్లూ నష్టపోయాయి.

You might also like