FbTelugu

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

* 45 వేలు దాటిన సెన్సెక్స్

    ముంబై: గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలను చవిచూశాయి. భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించిన పరపతి విధానంతో ఇన్వెస్టర్లు వాణిజ్యానికి మొగ్గుచూపారు.

ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 447 పాయింట్లు లాభపడి 45,080 కి చేరింది. దీంతో తొలిసారిగ సెన్సెక్స్ 45 వేల మార్కును దాటింది. అదే సమయంలో నిఫ్టీకూడా 125 పాయింట్లు లాభపడి 13,259 వద్దకు చేరింది. ఇవాళ సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలను చవిచూశాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.