FbTelugu

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఒక్కసారిగా పుంజుకున్నాయి. మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచే మార్కెట్లు దూసుకుపోయాయి. స్టాక్ మార్కెట్లపై అమెరికా అధ్యక్ష ఫలితాలు కొంతమేరకు ప్రభావం చూపాయని చెప్పవచ్చు.

దీంతో అన్ని సూచీలు లాభాలను చవిచూశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 704 పాయింట్లు లాభపడింది. దీంతో సెన్సెక్స్ 42,597 కి చేరింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 197 పాయింట్లు లాభపడి 12,461 వద్ద స్థిరపడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.