FbTelugu

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: ఇవాళ ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయి చివరకు ముగింపు సమయానికి ఒక్కసారిగా లాభాలను చవిచూశాయి. ఇవాళ మార్కెట్లు ప్రారంభంలోనే సెన్సెక్స్ 750 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టంలోనే ట్రేడింగ్ నడిచింది.

కాగా ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎవరూ ఊహించని రీతిలో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఇవాళ సెన్సెక్స్ 242.52 పాయింట్లు లాభపడి 33,780.89 వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ 70.90 పాయింట్లు లాభపడి 9,972.90 వద్ద ముగిసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.