FbTelugu

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: భారత స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా వరుస నష్టాలనే చవిచూస్తున్నాయి. తాజాగా ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది.

అదే సమయంలో నిఫ్టీ 130 పాయింట్లు నష్టపోయింది. వాల్ స్ట్రీట్ ప్రభావం ఆసియన్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. అమెరికన్ మార్కెట్ లోనూ పతనం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే రూ.1,600 కోట్ల ఎఫ్ఐఐలు ఉపసంహరించుకున్నాయి. దీనికి తోడూ అమ్మకాల ఒత్తిడి కూడా కొనసాగుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.