అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా భ్రమల్లోనే ఉన్నారంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో మారు చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమిని సూచిస్తూ.. గ్రేటర్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ.. తిరుపతి లోక్సభ స్థానంపై చంద్రబాబు నాయుడు ఇంకా ఆశలు పెట్టుకున్నారని, ప్రజలు వైసీపీకి దూరమయ్యారన్నారు.
ఈ సందర్భంగా.. ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికలలో ‘ఇరగదీసిన’ తర్వాత తిరుపతి గెలుపు కోసం సిద్ధంగా ఉండాలని బాబు కార్యకర్తలకు కనుసైగ చేస్తున్నారు. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరమయ్యారట. మానసిక రుగ్మతల వల్ల మీరు భ్రమల్లో ఉన్నా జనం మాత్రం పిచ్చ క్లారిటీతో ఉన్నారు. తొందరెందుకు? ఆ సరదా కూడా తీర్చుకుందురు’’ అంటూ ట్వీట్ చేశారు.