FbTelugu

మాజీ ఎమ్మెల్యేపై లాఠీ ఛార్జ్!

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో గాయాలైనట్టుగా సమాచారం. వివరాల్లోకెళితే.. స్థానిక గాజులరామారం కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ ను స్క్రూటినిలో కుట్రపూరితంగా డిస్ క్వాలిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ.. రిటర్నింగ్ ఆఫీసు వద్ద మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎంపీ రేవంత్ రెడ్డి రిటర్నింగ్ ఆఫీసుకు బయలుదేరారు. కాగా అక్కడికి అభ్యర్థి అడ్వకేట్ ను కూడా అధికారులు అనుమతించనడం లేదని, టీఆర్ఎస్ ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.