FbTelugu

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్ కలకలం

విశాఖపట్నం: ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం, లేకపోతే కష్టమంటూ స్టీల్ ఫ్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు.

ఈ లేఖ విశాఖ స్టీల్ ప్లాంట్ లో కలకలం సృష్టించింది. లేఖ చూసిన తరువాత సహచర ఉద్యోగులు, సెక్యురిటీ సిబ్బంది ఆయన కోసం గలిస్తున్నారు. ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలని అన్నాడు. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దన్నారు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నానని, 33వ వ్యక్తి అవుతానని ఆయన లేఖ లో స్పష్టం చేశాడు. ఈ రోజు ఫర్నేస్ లో అగ్నికి ఆహుతి కావడానికి సాయంత్రం 5:49 నిమషాలకు మూహుర్తం ఉంది కాబట్టి ఈ పోరాటం ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి అని ఆశిస్తున్నట్లు ప్రకటించాడు.

శుక్రవారం రాత్రి డ్యూటీ చేసి ఇవాళ ఉదయం ఆరు గంటలకు బయటకు వచ్చాడు. మనోధైర్యం కోల్పోయిన ఆయన లాగ్ బుక్ లో సూసైడ్ నోట్, ఐడీ కార్డు అక్కడే పెట్టి, మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఆయన కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

log book

కేసుల మాఫీ కోసం జగన్ రెడ్డి కేంద్ర పెద్దల కాళ్ల మీద పడటం వలనే విశాఖ ఉక్కు కాపాడుకోవడానికి కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ చూస్తే బాధేస్తుందన్నారు. కార్మికులు ప్రాణ త్యాగాలు చేసే నిర్ణయం తీసుకోవద్దని చేతులెత్తి వేడుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కార్మికులకు అండగా ఉంటుందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి ఏం చేసేందుకైనా టిడిపి సిద్ధంగా ఉందని లోకేష్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.