FbTelugu

బాణాసంచాపై ఉక్కుపాదం

విక్రయాలు, కాల్చడం నిషేధం

న్యూఢిల్లీ: బాణాసంచా పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఉక్కుపాదం మోపింది. దేశంలోని నగరాలు, మహా నగరాల్లో బాణాసంచాల విక్రయాలు, కాల్చడంపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు ఎన్జీటీ ప్రకటించింది.

కరోనా మహమ్మారితో జనం అల్లాడుతుండగా, దానికి ఆజ్యం పోసే విధంగా బాణాసంచా తయారైందని వ్యాఖ్యానించింది. కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో తగ్గేంత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. దీపావళి సందర్భంగా ఢిల్లీ నగర ప్రజలు పెద్ద ఎత్తున టపాసులను కాల్చడంతో మరింత కాలుష్యం పెరిగింది. ఫలితంగా కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి. వీటిని కాల్చేందుకు సుప్రీంకోర్టు రెండు గంటల సమయం ఇచ్చినప్పటికీ ఎవరూ పాటించలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.