FbTelugu

ఒక్క ట్వీట్ తో లక్ష కోట్లు ఆవిరి

వాషింగ్టన్: కొందరు ప్రముఖులు ఏదో ఒక అంశం మీద ట్విట్ చేయడం సరదా గా మారిపోయింది. తమ అభిమానులను ఆకట్టుకునేందుకు చేస్తున్న ట్వీట్లు బెడిసికొడుతున్నాయి.
అమెరికా విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా యజమాని ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ తో ఆయన కంపెనీ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. ఒక లక్ష రెండు లక్షలు కాదు ఏకంగా రూ.1 లక్ష కోట్లు అన్న మాట. నాలుగు లైన్ల ట్వీట్ ఆయన కొంపముంచింది. క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్, ఎత్ విలువ చాలా అధిక స్థాయిలో ఉందంటూ నాలుగు రోజుల క్రితం మస్క్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ను లక్షలాది మంది చూశారు. ఇంకే ముంది ఆయన కంపెనీ షేర్లకే నష్టం వచ్చింది.

అమెరికా మార్కెట్ లో టెస్లా షేరు సోమవారం నాడు 8.6 శాతం నష్టపోయింది. దీంతో మస్క్ వ్యక్తిగత సంపద 1,520 కోట్ల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.1.10 లక్షల కోట్లు ఆవిరి అయ్యింది. ఈ నష్టం కారణంగా ప్రపంచ ధనికుల్లో ఆయన స్థానం పడిపోయింది. అమెజాన్ ఆన్ లైన్ షాపింగ్ యజమాని జెఫ్ బెజొస్ మళ్ళీ అగ్రస్థానానికి చేరుకున్నారు. కాగా ఈ మధ్య మస్క్ బిట్ కాయిన్ పై పెట్టుబడులు పెంచుతూ పోతున్నారు. ఇప్పటి వరకు 150 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టారు. త్వరలోనే బిట్ కాయిన్ చెల్లింపులను అనుమతిస్తానని ప్రకటించడంతో దాని విలువ 50వేల డాలర్లు దాటింది. అయితే బిట్ కాయిన్లపై పలువురు అమెరికా ప్రముఖులు అనాసక్తిని వెల్లబుచ్చారు. అంత సురక్షితం కాదని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా ప్రకటించారు. పలువురు ఇలాంటి వాదనను లేవనెత్తడంతో మస్క్ షేర్లు ఢమాల్ అయ్యాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.