FbTelugu

యనమల, చినరాజప్ప అరెస్టులపై స్టే

అమరావతి: మాజీ మంత్రులు, టీడీపీ నాయకులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలపై నమోదైన ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో హైకోర్టు స్టే మంజూరు చేసింది.

మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీ, ఆమె భర్త, కుమారుడిపై నమోదైన వేధింపుల  కేసులోనూ స్టే లభించింది. ఎవరినీ అరెస్ట్ చేయొద్దంటు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  కేసులో తర్వాతి చర్యలపై కూడా స్టే ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టీడీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు.

You might also like