FbTelugu

ట్విటర్ ఎం.డి పై స్టే… సుప్రీం యుపి సవాల్

న్యూఢిల్లీ: ట్విటర్ కథ తేల్చేందుకే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, యుపి లోని యోగి ప్రభుత్వం ప్రత్యక్షంగా రంగంలోకి దిగాయి. ట్విటర్ ఇండియా ఎం.డి మనీష్ మహేశ్వరిని అరెస్టు చేయకుండా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన స్టే ను యుపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

ఘజియాబాద్ లోని ఒక ముస్లిం వృద్ధుడిపై దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో ఘజియాబాద్ పోలీసులు ఆయన కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై మనీష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది. ట్విటర్ ను జమ్మూ కాశ్మీర్ ను వేరే దేశంగా గుర్తించడం, లద్దాఖ్ ను పాకిస్థాన్ దేశంలో చూపించడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఈ ఘటనపై కేంద్ర ఐటి శాఖ మంత్రి ట్విటర్ కు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా యుపి ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన స్టే ను రద్దు చేయాలని కోరుతూ యుపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ట్విటర్ ఐ.ఎన్.సి, ట్విటర్ కమ్యూనికేషన్స్ ఇండియా, పలువురు జర్నలిస్టులపై పోలీసులు కేసు పెట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.