FbTelugu

అంతర్రాష్ట్ర రవాణాపై రాష్ట్రాలదే తుది నిర్ణయం: కేంద్రం 

తెలుగు రాష్ట్రాల్లో అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో లాక్ డౌన్ కు అనేక సడలింపులు ఇచ్చిన కేంద్రం అంతర్రాష్ట్ర రవాణాపై రాష్ట్రాలదే తుది నిర్ణయమని కేంద్ర స్పష్టం చేసింది. కాగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అంతర్రాష్ట్ర రవాణాపై ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదు.

పక్కనే ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా ఉండడంతో ఆంక్షలను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తర్వాతనే అనుమతిస్తామని టీఎస్ పోలీసులు తేల్చి చెప్పేస్తున్నారు.  కాగా అంతర్రాష్ట్ర రవాణాపై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

You might also like