FbTelugu

కోడికూర నారాయణకు ఎందుకంత కోపం: మంత్రి అజయ్

హైదరాబాద్: సీపీఐ జాతీయ కార్యదర్శి, కోడికూర నారాయణ కు నాపై ఎందుకంత కోపం ఉందో అర్థం కావడం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనపై బీజేపీ కార్యకర్తలు చేసిన దాడిని కోడికూర నారాయణ సమర్థిస్తున్నారా అని మంత్రి ప్రశ్నించారు. నేను కూడా కమ్యూనిస్టు బిడ్డనే, ఇటువంటి దాడులకు భయపడేది లేదన్నారు. నారాయణ లాంటి సీనియర్ నాయకుడు అసలేమి జరిగిందని తెలుసుకోకుండా ప్రచారం కోసం వాగడం సరికాదని పువ్వాడ అజయ్ చురక అంటించారు. గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ రోజున పువ్వాడ్ అజయ్ ను కూకట్ పల్లి ఫోరమ్ మాల్ దగ్గర బీజేపీ కార్యకర్తలు వెంబడించిన విషయం తెలిసిందే. కాన్వాయతో వచ్చిన ఆయన డబ్బులు పంచుతున్నారని సమాచారం రాగానే బీజేపీ కార్యకర్తలు చేరుకుని కారుకు అడ్డుగా పడుకుని ఆందోళన చేశారు.

మాటామాటా పెరగడంతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. వివాదం మరింతగా ముదురుతుందని గ్రహించిన అజయ్ అక్కడి నుంచి వేరే కారులో ప్రయాణమై వెళ్లిన విషయం వెలుగుచూసింది. ఈ ఘటనపై మంత్రి అజయ్ నిన్ననే స్పందించకుండా ఇవాళ స్పందించారు. బాచుపల్లిలోని నా మెడికల్ కాలేజీకి వెళ్తుండగా కూకట్ పల్లి ఫోరమ్ మాల్ దగ్గర బీజేపీ కార్యకర్తలు తన కాన్వాయ్ పై దాడి చేశారు. ఓడిపోతామనే అక్కసుతో తనపై దాడికి దిగారని అన్నారు. కారులో డబ్బులు పెట్టి పంచడానికి నేను వెర్రిపువ్వును కానని అజయ్ ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎక్కిన కారు నాది కాదు, నావన్నీ టయోటా ఫార్చునర్ కార్లేనన్నారు. నన్ను చంపేందుకు ప్రయత్నించారని, ఇది పద్దతి కాదని ఆయన ఖండంచారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం తప్పదని అజయ్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.