FbTelugu

టిడిపి నేతల కబ్జాలో రూ5వేల కోట్ల భూములు: మంత్రి శ్రీనివాస్

విశాఖపట్నం: గత తెలుగుదేశ ప్రభుత్వం హయాంలో విశాఖపట్నంలో వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
మంత్రి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు ఎంతటివారైనా చర్యలు తప్పవన్నారు. టిడిపి నేతల భూ కబ్జాలపై మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని, టిడిపి నేతలపై కక్షసాధింపునకు దిగాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. విశాఖ భూముల కుంభకోణంపై సిట్‌ నివేదిక బయటపెడతామని అన్నారు. పల్లా సింహాచలం అండ్‌కో రూ.700 కోట్ల విలువైన భూకబ్జా చేశారని ఆయన వివరించారు. ప్రభుత్వ భూమి కబ్జాతోపాటు కొంత భూమిని అమ్మేశారు. టిడిపి నేతలు కబ్జా చేసిన భూములను పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి శ్రీనివాస్ అన్నారు.
అందుకే గత కొన్నిరోజులుగా మాజీ మంత్రులు సిహెచ్.అయ్యన్నపాత్రుడు, కె.అచ్చెన్నాయుడు మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. టిడిపి నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావే అతిపెద్ద కబ్జాదారుడు. ఇవాళ ఆక్రమణల తొలగింపుపై ముందస్తుగా అరుపులు, పెడబొబ్బలు పెడుతున్నారు. ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలనా రాజధాని నిర్మాణం జరుగుతుందని అన్నారు. విశాఖలో కబ్జాలు, ఆక్రమణల తొలగింపుపై వాస్తవాలు ఇవి అని మంత్రి శ్రీనివాస్ తెలిపారు.

టిడిపి నేతల కబ్జాలో విశాఖపట్నం…
ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్న మొత్తం భూముల మార్కెట్ విలువ రూ.4,291 కోట్లు (430.81 ఎకరాలు)
ఇవాళ తొలగిస్తున్న ఆక్రమణల విలువ రూ.791.41 కోట్లు (49.05 ఎకరాలు)
మ్తొతంగా రూ.5,080 కోట్లకుపైగా విలువైన భూముల, ఆస్తులు స్వాధీనం.

You might also like

Leave A Reply

Your email address will not be published.