FbTelugu

ఏపీలో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు: మంత్రి సురేష్

అమరావతి: ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్మిడియట్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఒక వేళ కోవిడ్ కేసులు పెరిగితే అప్పుడు ఆలోచిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కోవిడ్ నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పరీక్షల నిర్వహణపై గురువారం నాడు సిఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం జరుపుతున్నారని, ఆ సమావేశంలో కూడా చర్చిస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు చేయడంతో పాటు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేయడంతో, పలు రాష్ట్రాలలో స్టేట్ సిలబస్ విద్యార్థులు కూడా ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.