FbTelugu

మత ఘర్షణకు కుట్రలు: డీజీపీ

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఆసరాగా తీసుకోని కొందరు మత ఘర్షణకు పాల్పడే అవకాశం ఉన్నట్లు కచ్చితమైన సమాచారం ఉందని రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి తెలిపారు.
డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, విధ్వంసక శక్తులను అడ్డుకునేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. సోషల్ మీడియా లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పోస్టులు పెడుతున్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగే పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే పోస్టులు కనిపిస్తే ప్రజలు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. మూడు పోలీస్ కమిషనరేట్ లలో అన్ని విభాగాల కలుపుకొని విధులు నిర్వహిస్తారని అన్నారు.
మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అని సమాచారం ఉందని మహేందర్ రెడ్డి వివరించారు. ఇప్పటి వరకు 50 కేసులు నమోదు చేశారని, విచారణ జరుపుతున్నారని చెప్పారు. పాత బస్తీలో రోహింగ్యాల అక్రమ నివాసం విషయంలో 60కి పైగా కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. మత ఘర్షణలు జరిపేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు.. వాళ్ళ పై మా నిఘా ఉంటుందన్నారు.రహస్య సమాచారాన్ని మేము బయటపెట్టలేము.. అవసరం అనుకున్నప్పుడు చర్యలుంటాయని ఆయన వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.