FbTelugu

‘వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి’: ఎమ్మెల్యే ధర్మాన

అమరావతి: పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు. పాల‌న రాజ‌ధానికి విశాఖ‌ప‌ట్నం అనుకూలమని అన్నారు.

పాల‌న వికేంద్రీక‌ర‌ణ అనేది ప్ర‌పంచ‌మంతా అనుస‌స‌రిస్తున్న విధానం, నిపుణులు సూచిస్తున్న విధానం. అన్ని ప్రాంతాల ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా వెళ్తున్నామని తెలిపారు. చంద్ర‌బాబుకు మాట్లాడే నైతిక హ‌క్కు లేదన్నారు. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగానే ప్రభుత్వం రాష్ట్రాన్ని 25 జిల్లాలు చేయాల‌నే నిర్ణ‌యం తీసుకున్నట్టు తెలిపారు.

You might also like