FbTelugu

వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం సీఎం యాప్ నూ ప్రారంభించి మాట్లాడారు. సీఎం యాప్ ద్వారా రైతులకు నగదు చెల్లింపులు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

విత్తనాలు, ఎరువులకు ప్రభుత్వమే బాధ్యత వహించనుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ల ద్వారా.. రైతులకు సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. రైతు భరోసా కేంద్రాల కాల్ సెంటర్ నెంబర్ 155251కు ఫోన్ చేసి సూచనలు, సలహాలు పొందవచ్చని తెలిపారు. తాము ఇచ్చిన 129 హామీల్లో 77 అమల్లోకి వచ్చాయని, మరో 36 హామీలు అమలుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చినట్టు తెలిపారు.

You might also like