FbTelugu

సిఎం గా స్టాలిన్ ప్రమాణం

మంత్రివర్గంలో బిసిలకు పెద్దపీట

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకె.స్టాలిన్ కొద్ది సేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో భన్వరీలాల్ పురోహిత్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా స్టాలిన్ చేత ప్రమాణం చేయించారు.

స్టాలిన్ తో పాటు 33 మంది మంత్రులు కూడా నిరాడంబరంగా ప్రమాణం చేశారు. కరోనా ఉధృతి కారణంగా సాదాసీదాగా కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లకు గాను 133 చోట్ల స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె విజయం సాధించింది. బిసిలకు 24, అగ్రవర్ణాలు 6, ఎస్సిలు 3, ఎస్టి  1 చొప్పున మొత్తం 34 మందితో మంత్రిమండలి ఏర్పాటు అయ్యింది. స్టాలిన్ తన మంత్రివర్గంలో బిసి లకు పెద్ద పీట వేశారు. తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గం లో కులాల వారిగా కూర్పు ఇలా ఉంది.

 

బిసి వర్గం వారు…

సిఎం – ఎంకె.స్టాలిన్ (బిసి, ఇసాయి వెలార్) – 1

కొంగు వెల్లల్లా – 4

కల్లార్ – 3

వన్నియార్ – 3

యాదవ – 2

ముస్లింలు – 2

హిందూ నాదర్ – 1

బలిజా నాయుడు – 1

బోయ నాయుడు – 1

పాటర్ – 1

మరవర్ – 1

ముదలియార్ (సెంగుండ) – 1

శైవ వెల్లల – 1

ముతారాయార్ – 1

మత్స్యకారులు (గంగపుత్ర) – 1

మొత్తం – 24

 

షెడ్యూల్డ్ కులాలు…

దేవేంద్రకుళ వెల్లల్లా – 1

ఆది ద్రావిడ – 1

అరుండదియార్ (మడిగా) – 1

మొత్తం – 3

 

షెడ్యూల్డ్ తెగలు… 1

 

ఇతర కులాలు…

క్రిస్టియన్ నాదర్ – 02

రెడ్డి – 02

కమ్మ – 01

చెట్టియార్ – 01

మొత్తం – 06.

You might also like

Leave A Reply

Your email address will not be published.