FbTelugu

బిజెపికి షాకిచ్చిన స్టాలిన్

తమిళనాడులో బ్రాహ్మణేతర పూజారులు

చెన్నై: హిందూ మత ఆధిపత్య భావజాలానికి గండి పెట్టేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ చర్యలు చేపట్టారు. హిందూ దేవాలయాల్లో బ్రాహ్మణ పురోహితుల పెత్తనానికి గండి పెడుతున్నారు.

భారీ మెజారిటీతో తమిళనాడు సిఎం గా ఎం.కె.స్టాలిన్ మొన్న జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. బ్రాహ్మణ వ్యతిరేక పార్టీగా డిఎంకె గుర్తింపు పొందింది. నమ్మిన సిద్ధాంతం కోసం స్టాలిన్, ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి ఎం.కె.కరుణానిధి కూడా పోరాడుతునే ఉన్నారు. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా వంద రోజుల్లో 200 మంది బ్రాహ్మణేతరులను ఆలయాల్లో పూజారుల్లో నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ లు గుర్రుగా ఉన్నా స్టాలిన్ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించవద్దని బిజెపి ఆల్టిమేటం కూడా ఇచ్చింది. హిందూ వ్యతిరేక ఆలోచలను డిఎంకె బయటపెడుతున్నదని బిజెపి విమర్శిస్తోంది.

ఇందు కోసం తమిళనాడు ప్రభుత్వం వంద రోజుల శైవ అర్చక్ కోర్సులను ప్రారంభించనున్నది. ఈ కోర్సును పూర్తి చేసిన హిందువులు ఎవరైనా పూజారిగా పనిచేయవచ్చు. తమిళనాడు ఎండోమెంట్ పరిధిలో 36వేల దేవాలయాలు ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే వంద మంది తో తొలి జాబితా ఆ తరువాత మరో వంద మందితో జాబితా విడుదల చేయనున్నారు. సంస్కృతం కాకుండా తమిళ భాషలోనే ఇక నుంచి దేవాలయాల్లో పూజలు జరుగుతాయని తమిళనాడు మంత్రి పికె.శేఖర్ బాబు ప్రకటించారు. దీన్ని కూడా బిజెపి, ఆర్ఎస్ఎస్ లు వ్యతిరేకిస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో కూడా బ్రాహ్మణేతరులైన హిందువులను  పూజరులుగా నియమిస్తున్నారు. కేరళలో కూడా బిజెపి, ఆర్ఎస్ఎస్ లు ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.