FbTelugu

విజయం ఊహించిందే: స్టాలిన్

చెన్నై: తమిళనాడు లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ విజయం దాదాపు ఖరారు అయ్యింది. ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించడమే తరువాయి డిఎంకె పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక తేదీ వెల్లడించనున్నది.

విజయం నేపథ్యంలో డిఎంకె అధినేత ఎం.కె.స్టాలిన్ స్పందించారు. ఈ విజయం ఊహించిందేనని, డిఎంకె చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతున్నదని ఆయన తెలిపారు. కరోనా విజృంభణ కారణంగా సంబురాలు, విజయోత్సవ ర్యాలీలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద చివరి ఓటు లెక్కించే వరకు పోలింగ్ ఏజెంట్లు కూర్చుని ఉండాలని, ఫలితాలు ప్రకటించిన తరువాతనే కౌంటింగ్ హాలు నుంచి బయటకు రావాలని స్టాలిన్ కోరారు. స్టాలిన్ నివాసం, డిఎంకె కార్యాలయం ముందు సందడిగా మారింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.