FbTelugu

కొడైకెనాల్ లో స్టాలిన్ కుటుంబం

చెన్నై: తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో డిఎంకె అధినేత ఎంకె.స్టాలిన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సేదతీరేందుకు కొడైకెనాల్ కు బయలు దేరారు. కొండ గ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించారు.

నాలుగు రోజుల క్రితం స్టాలిన్, ఆయన భార్య దుర్గ, కుమారుడు ఉదయనిధి, మనుమలు, మనుమరాళ్లతో కలిసి కొడైకెనాల్ కు చేరుకున్నారు. ప్రైవేటు హోటల్ లో దిగిన వారు మూడు రోజుల వరకు బయటకు రాలేదు. సోమవారం ఉదయం స్టాలిన్ తన కుటుంబ సభ్యులతో కొండ గ్రామలు మన్నవనూర్, కుక్కాల్ లో పర్యటించారు. గొర్రెలు, కుందేళ్ల పరిశోధన కేంద్రాలను పరిశీలించారు. ఆ తరువాత కుక్కాల్ ప్రాంతంలో కొండెక్కి అందాలను తిలకించారు. స్టాలిన్ వచ్చారని తెలుసుకున్న పలువురు ఆయనతో కలిసి ఫొటో దిగేందుకు ఉత్సాహం చూపించారు. రెండు రోజుల క్రితం తమిళ హాస్య నటుడు వివేక్ మృతి చెందడంతో నివాళులు అర్పించేందుకు ఉదయనిధి చెన్నై వెళ్లి తిరిగి వచ్చారు. మంగళవారం సాయంత్రం తిరిగి స్టాలిన్ కుటుంబం చెన్నై చేరుకోనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.