FbTelugu

సిబ్బంది తప్పిదం… కోట్లు చెల్లించిన యాపిల్

వాషింగ్టన్: యాపిల్ సర్వీసు సెంటర్ లో ఇద్దరు సిబ్బంది చేసిన తప్పిదానికి ఆ సంస్థ కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించక తప్ప లేదు. రిపేర్ కోసం వచ్చిన ఫోన్ లోని పర్సనల్ ఫోటోలను సిబ్బంది సోషల్ మీడియాలో షేర్ చేయడమే కొంపముంచింది.

టెలిగ్రాఫ్ అనే ఇంగ్లీషు పేపర్ లో వచ్చిన కథనం తో కాలిఫోర్నియాలోని జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చేసింది. ఓరెగాన్ యూనివర్సిటీలో ఒక విద్యార్థిని చదువుతోంది. తన యాపిల్ ఫోన్ రిపేర్ కు రావడంతో 2016 లో సర్వీసు సెంటర్ కు వెళ్లింది. పెగట్రాన్ అనే సంస్థ ఈ సర్వీసు సెంటర్లను నిర్వహిస్తుంటుంది. ఆమె ఫోన్ లోని వ్యక్తిగత చిత్రాలు, వీడియోలను చూసిన సాంకేతిక సిబ్బంది అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు ఆన్ లైన్ లో పెట్టారు. కొద్ది రోజుల తరువాత ఈ విషయం స్నేహితుల ద్వారా ఆమెకు తెలిసింది. మొత్తానికి కష్టపడి ఆ ఫొటోలను ఆన్ లైన్ నుంచి తొలగించింది. తన వ్యక్తిగత స్వేచ్ఛ హరించేలా ఫొటోలు, వీడియోలను షేర్ చేశారంటూ ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. విద్యార్థిని తరఫు న్యాయవాది రూ.36 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
తన క్లయింట్ ను మానసికంగా క్షోభకు గురి చేశారని, బహిరంగ మార్కెట్ లో ఆమె ఫొటోలను పెట్టారంటూ న్యాయవాది వాదించారు. గుట్టుచప్పుడు కాకుండా యాపిల్ సంస్థ ఈ సెటిల్ మెంట్ చేసుకున్నది. బాధితురాలికి పెద్ద మొత్తంలో ముట్టచెప్పినట్లు టెలిగ్రాఫ్ వెల్లడించింది. ఈ మొత్తాన్ని పెగట్రాన్ సంస్థ నుంచి యాపిల్ రాబట్టుకున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.