FbTelugu

నేటి నుంచి హైదరాబాద్ లో శ్రీవారి లడ్డూలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో (హైదరాబాద్) నేటినుంచి శ్రీవారి లడ్డూల విక్రయం కొనసాగనుంది. ఈ సందర్భంగా తిరుమల నుంచి 60 వేల లడ్డూలను టీటీడీ హైదరాబాద్ కు పంపింది.

శ్రీవారి లడ్డూల విక్రయాలకు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే విశేష స్పందన రావడంతో టీటీడీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం గత రెండు నెలలుగా మూతపడిన విషయం తెలిసిందే.

You might also like