FbTelugu

భారీగా పడిపోయిన శ్రీవారి హుండీ ఆదాయం

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పడిపోయింది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడం.. ఆంక్షలను కూడా కఠినతరం చేయడంతో శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పడిపోయింది.

నిన్న శ్రీవారిని 4,984 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.35 లక్షలుగా ఉన్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇవాళ పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. రేపటినుంచి కళ్యాణోత్సవం సేవలను పునరుద్దరించనున్నారు.

You might also like