FbTelugu

శ్రీశైలం ఈఓ ఫేస్ బుక్ హ్యాక్

కర్నూలు: శ్రీశైలం భ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెఎస్.రామారావు ఫేస్ బుక్ హ్యాక్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన వెంటనే అప్రమత్తమై తన ఖాతా ద్వారా వచ్చే మెస్సేజీ లకు ఎవరూ స్పందించవద్దని కోరారు.

తన ఫేస్ బుక్ ఖాతాను హ్యాక్ చేసిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు, డబ్బులు పంపించాల్సిందిగా మెస్సేజీలు పంపిస్తున్నారు. కష్టాల్లో ఉన్నానని, ఆదుకోవాలని అందులో కోరుతున్నారన్నారు. పొరపాటున ఎవరు కూడా వాటిని చూసి డబ్బులు పంపించవద్దని వాట్సప్, ఎస్ఎంఎస్ లు, ఫోన్ ద్వారా ఈఓ రామారావు సన్నిహితులు, బంధువులు, ఉద్యోగులను కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.